: సెలబ్రిటీ క్రికెట్ లీగ్... అశ్విన్ చెలరేగితే... ప్రిన్స్ చితక్కొట్టాడు!
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు సత్తాచాటింది. భోజ్ పురి దబాంగ్స్ తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ ఆటగాళ్లు రాణించారు. ఓపెనర్ ప్రిన్స్ 68 పరుగులతో అదరగొడితే, మిడిలార్డర్ లో సుధీర్ బాబు (16) అఖిల్ (19) మెరుపులు మెరిపించారు. దీంతో తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్ ముగుస్తుందని భావించిన తరుణంలో క్రీజులోకి అడుగుపెట్టిన అశ్విన్ కేవలం 18 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు సాధించాడు. అతనికి ఆదర్శ్ (14) సహకరించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో తెలుగు వారియర్స్ జట్టు 177 పరుగులు సాధించింది. దీంతో భోజ్ పురి దబాంగ్స్ జట్టు 178 పరుగులు చేయాల్సి ఉంది. తెలుగు వారియర్స్ కు మంచి బౌలర్లు ఉండడంతో మ్యాచ్ చేజారే అవకాశం లేదని తెలుగు సినీ నటులు భావిస్తున్నారు.