: కేపీహెచ్ బీలో యువతి మిస్సింగ్
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్ కేసు నమోదయ్యింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సావ్యశ్రీలక్ష్మి అనే యువతి తిరిగి ఇంటికి చేరలేదు. శ్రీలక్ష్మి నిజాంపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో శ్రీలక్ష్మి మావయ్య దగ్గరే ఉండి చదువుకుంటోంది. ఆమె మావయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.