: రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సరే, మరి విధుల సంగతేంటి?: రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల సంగతి సరే...మరి రాజ్యాంగం కల్పించిన విధుల మాటేమిటని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశసరిహద్దుల్లో వీరజవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, దేశంలో కొన్ని శక్తులు దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయని అన్నారు. మనదేశంలో కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులు అలా చేయగలిగారని, అదే అమెరికాలో ఒసామాబిన్ లాడెన్ హత్యపై అమెరికాలో నిరసన వ్యక్తం చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు మన దేశంలో తప్ప మరే దేశంలోనూ కనబడవని ఆయన తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు అదే రాజ్యంగం సూచించిన విధుల గురించి కూడా మాట్లాడాలని ఆయన సూచించారు.