: ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశం...దానిని రాజకీయం చేయవద్దు: ఏపీ మంత్రి రావెల
ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశమని, దానిని రాజకీయం చేయవద్దని మంత్రి రావెల కిషోర్ బాబు సూచించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ మేరకు గతంలో రెండు సార్లు శాసనసభలో తీర్మానం కూడా చేశామని ఆయన గుర్తుచేశారు. దీనిపై పార్లమెంటులో చట్టసవరణ చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఎస్సీల సంక్షేమం, దళితుల అభివృద్ధి కోసం టీడీపీ పాటుపడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలోనే ఎస్సీ కార్పోరేషన్ ద్వారా వెయ్యి కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు. ఎస్సీ కాలనీల్లో రహదారుల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 2018 నాటికి అన్ని ఎస్సీఎస్టీ కాలనీల్లో రోడ్లను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.