: అమెరికా శ్వేత సౌధం ఎదుట బెలూచిస్థాన్ వాసుల ఆందోళన


అమెరికాలోని శ్వేత సౌధం (అధ్యక్ష భవనం) ఎదుట పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ కు చెందిన వందలాది మంది బెలూచ్ అమెరికన్లు ఆందోళన నిర్వహించారు. పాకిస్థాన్ దురాక్రమణను అడ్డుకోవాలని వారు డిమాండ్ చేశారు. బెలూచ్ ముఖ్యనేతలు చేపట్టిన ఈ శాంతియుత ఆందోళనలో పాక్ అక్రమాలను ఎలుగెత్తిచాటారు. తమ ప్రాంతంలో ఐఎస్ఐ సాయంతో పాకిస్థాన్ అంతులేనన్ని అక్రమాలకు పాల్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బెలూచిస్థాన్ లో హక్కుల రక్షణకు నాటో దళాలను పంపాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే 35,000 మంది బెలూచ్ పౌరులు కనబడడం లేదని బెలూచ్ ముఖ్యనాయకుడు ఖాదిర్ బెలూచ్ అన్నారు. బెలూచిస్థాన్ ప్రజల మానవ హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, అందుకు కారణం పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక బెలూచిస్థాన్ తోనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆయన స్పష్టం చేశారు. జరుగుతున్న దారుణాలకు నిరసనగా 2013లో ఆయన బెలూచిస్థాన్ లోని క్వెట్టా నుంచి పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ వరకు 3000 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. ఒబామా తక్షణం జోక్యం చేసుకుని నాటో దళాలను బెలూచిస్థాన్ కు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కు అమెరికా అణ్వాయుధాలను ఇస్తే వాటిని బెలూచిస్థాన్ పౌరులను హతమార్చేందుకు వినియోగిస్తారని ఆయన ఆరోపించారు. ఈ మధ్యనే ముగ్గురు బెలూచిస్థాన్ నేతలను పాక్ దారుణంగా హతమార్చిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News