: ఇండియాలో 'థోర్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరో, హీరోయన్ల సాహసయాత్ర


'థోర్' సినిమా గుర్తుందా, బరువైన సుత్తితో విలన్ల భరతం పట్టే టైటిల్ పాత్రధారి క్రిస్ హేమ్ వర్త్, 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' హీరోయిన్ ఎల్సా పాట్కీ మధ్యనున్న బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఒకరికోసం ఒకరు అనేలా ఉంటారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు వీరు ఈ ప్రేమికుల దినోత్సవం నాడు సాహస యాత్రకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సాహస యాత్రలకు పుట్టినిల్లయిన భారత దేశానికి వచ్చారు. గోవా, లడఖ్ ప్రాంతాలను చుట్టేసిన వీరిద్దరూ తాజాగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ కు సిద్ధమవుతున్నారు. ప్రేమికుల రోజు గుర్తుండిపోయేలా ఆ రోజున వీరు హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేయనున్నారు. వీరి యాత్రను స్పెయిన్ కు చెందిన ప్లానెట్టా ఛలెజా (ప్లానెట్ ఛాలెంజ్) అనే అడ్వెంచర్ సంస్థ గైడ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News