: ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై హిందూ కార్యకర్తల దాడి


ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై హిందూ శ్రేణులు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వసంత పంచమిని పురస్కరించుకుని భోజ్ శాల, కమల్ మౌలా మసీదు విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఇక్కడ పూజలు నిర్వహించేందుకు హిందూ, ముస్లింలు ఒకేసారి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు భోజ్ శాలలో పూజలకు హిందువులు రావద్దంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ జాగరణ్ మంచ్, భోజ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చాయి. ఒంటి గంట తరువాత హిందువులను పూజలకు భోజ్ శాలకు అనుమతించారు. దీనిపై హిందూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజ్ శాలను ఆర్ఎస్ఎస్ నేతలు అమ్మేశారని ఆరోపించారు. దీంతో స్థానిక ఆర్ఎస్ఎస్ నేత విజయ్ సింగ్ రాధోడ్ నివాసం ముందు భారీ ఆందోళనకు రంగం సిద్ధం చేశారు. రాజకీయ భవిష్యత్ పై ఆశతో విజయ్ సింగ్ బీజేపీతో కుమ్మక్కయ్యాడని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అనంతరం హిందూ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.

  • Loading...

More Telugu News