: రొమాన్స్ స్కాంలో కి'లేడీ'లే టాప్!


రొమాన్స్ స్కాం... వినడానికి ఈ పదం కొత్తగా ఉన్నప్పటికీ ఎంతో కాలంగా జరుగుతున్న దోపిడీ ఇది. ఇందులో ప్రధానంగా బలహీనులైన పురుషులు బాధితులుగా మారుతుంటారు. కొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా బాధితులుగానే మారుతుంటారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ ఓ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఈ స్కాంలో 2,620 పురుషులు బాధితులుగా మిగిలారని పేర్కొంది. ఇందులో సుమారు వంద కోట్ల రూపాయలను పురుషులు కోల్పోయినట్టు సదరు సర్వే తెలిపింది. ప్రతి పదిమందిలో ఒకరు ఈ స్కాం బాధితులు కావడం విశేషం. ఈ రొమాన్స్ స్కాంలో 43.4 శాతం మంది మహిళలు దొరికిపోగా, 39 శాతం మంది పురుషులు కూడా ఉన్నారు. 17 శాతం మంది జెండర్ వ్యక్తం చేయలేదని సదరు సంస్థ వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది 45 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులు కావడం విశేషం. కాగా, ఈ రొమాన్స్ స్కాంలో నైజీరియన్ మహిళల చేతిలో ఎక్కువ మంది మోసపోయినట్టు సర్వే తెలిపింది.

  • Loading...

More Telugu News