: తెలంగాణలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధేస్తోంది: రేవంత్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ లోకి టీటీడీపీ ఎమ్మెల్యేలు వరుస కట్టడంపై టీ టీడీపీ శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధేస్తోందని హైదరాబాదులో మీడియాతో అన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే మనుషులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. జంతువులకు ఉన్న విశ్వాసం కూడా ఎమ్మెల్యేలకు లేకపోవడం బాధ కలిగిస్తోందన్న రేవంత్, పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు నిలబడి కలబడిన వాడే మగాడన్నారు. సీఎం మనవడు గోళీలు ఆడుకునేందుకు తెలంగాణ సచివాలయం వేదికగా మారిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News