: వీర జవాను ముస్తాక్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం


కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నెపల్లి గ్రామానికి చెందిన వీర జవాన్ ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. దాంతో పాటు ఒక ఇల్లును కూడా మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ముస్తాక్ మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన ధీరోదాత్తుడని సీఎం అభివర్ణించారు. రాష్ట్ర యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ లోని సైనిక యుద్ధ స్థావరం సియాచిన్ మంచుతుపానులో ఇటీవల చిక్కుకుపోయి ముస్తాక్ మరణించాడు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నారు.

  • Loading...

More Telugu News