: కరుణానిధితో ఆజాద్ భేటీ... తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పొత్తుపై చర్చ


రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు పొత్తుల కోసం ఆ రాష్ట్రంలోని పలు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో డీఎంకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకే ఇళంగోవన్ తదితరులు సమావేశమయ్యారు. 2004 నుంచి 2013 వరకు డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగింది. ఆ తరువాత పలు కారణాలవల్ల పొత్తు నుంచి డీఎంకే వైదొలగింది. దాంతో 2014 లోక్ సభ ఎన్నికల్లో విడిగా పోటీచేసిన కాంగ్రెస్, డీఎంకేలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి. దాంతో ఈసారి శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఎదుర్కోవాలంటే ఎక్కువ మంది మిత్రులను కూడగట్టుకోవడం డీఎంకేకు తప్పనిసరి. అందుకే సాధ్యమైనంత ఎక్కువమందితో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలతో మంతనాలు జరపగా, తొలిసారి కాంగ్రెస్, డీఎంకేల మధ్య ఈ ఉదయం 11.30 నుంచి ప్రాథమిక పొత్తు అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News