: ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ హేమంతరావు మృతి
ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సామినేని హేమంతరావు మృతి చెందారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తుండగా ఈ ఉదయం ఆయన కన్నుమూశారు. హేమంతరావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు.