: ఖేడ్ లో ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఖేడ్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి కుమారుడు, ప్రస్తుత ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సంజీవరెడ్డి, పోలింగ్ ప్రారంభం కాగానే తన ఓటు వేశారు. గతంలో కంటే పోలింగ్ శాతం కాస్తంత పెరిగే అవకాశముందని చెప్పిన సంజీవరెడ్డి, తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు.