: మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా


జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీ ఆట మధ్యలో టీమిండియా తడబడింది. దీంతో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ టాపార్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (51), రోహిత్ శర్మ (43) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగిపోయింది. ఏడవ ఓవర్ లో టీమిండియాకు ధావన్ రూపంలో తొలి దెబ్బతగిలింది. అనంతరం అజింక్య రహానే (25)తో కలిసిన రోహిత్ జట్టు స్కోరును ముందుకు నడిపాడు. ఈ క్రమంలో పదకొండో ఓవర్ లో టీమిండియా సెంచరీ మార్కును దాటింది. అనంతరం 13వ ఓవర్ లో రోహిత్ అవుటయ్యాడు. ఆ వెంటనే, కుదురుకున్నాడనుకున్న రహానే భారీ షాట్ కు యత్నంచి మిడ్ వికెట్ లో దొరికిపోయాడు. దీంతో టీమిండియా వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో రైనా (5) హార్డిక్ పాండ్య (11) జత కలిశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో చమీర రెండు, సేనానాయకే ఒక వికెట్ తీయగా, 16 ఓవర్లు ఆడిన భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News