: ధావన్ అర్ధ సెంచరీ...బోణీ కొట్టిన చమీర


టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంకతో జరుగుతున్న రెండో టీట్వంటీలో శివాలెత్తాడు. తొలి టీట్వంటీలో విఫలమైన ధావన్ రెండో వన్డేలో గతి తప్పిన బంతులును బౌండరీ లైన్ దాటించడం మొదలుపెట్టాడు. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న ధావన్ రెండు సిక్సులు, ఏడు ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. అనంతరం కీపర్ తల మీదుగా ఓ బంతిని బౌండరీకి పంపుదామని ప్రయత్నించిన ధావన్, ఆ ప్రయత్నంలో దొరికిపోయాడు. బ్యాటును ముద్దాడిన బంతి వెళ్లి కీపర్ చండిమాల్ చేతుల్లో పడింది. దీంతో తొలి వికెట్ గా ధావన్ పెవిలియన్ చేరగా, శ్రీలంకకు చమీర బోణీ చేశాడు.

  • Loading...

More Telugu News