: ఆంధ్రాలోని తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పిస్తా: కేటీఆర్ హామీ
ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లయినా తమను సొంత రాష్ట్రానికి బదిలీ చేయడం లేదని, కమల్ నాథన్ కమిటీ తమను పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని, రాష్ట్ర ఉద్యోగులను వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తనదేనని వారికి హామీ ఇచ్చారు.