: మీడియాపై మండిపడ్డ ఐశ్వర్యారాయ్
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ బచ్చన్ మీడియాపై రుసరుసలాడింది. ఆ మధ్య కుమార్తె ఆరాధ్యకు తీవ్ర జ్వరం వచ్చినా, తాను షూటింగులో ఉండిపోవడం వల్ల దగ్గరుండి చూసుకోలేకపోయానని ఆందోళన వ్యక్తం చేసిన ఐశ్వర్యారాయ్ బచ్చన్, ఈ మధ్య కుమార్తెను కూడా షూటింగ్ స్పాట్ కు తీసుకువస్తోంది. అలాగే ఇటీవల 'యే దిల్ హై ముష్కిల్' స్పాట్ కు కూడా తీసుకువచ్చింది. దాంతో, తల్లీకూతుర్లను కెమెరాలలో బంధించేందుకు మీడియా ఫోటోగ్రాఫర్లు ఉత్సాహం ప్రదర్శించడంతో, చంకనున్న కూతుర్ని తీసుకుని ఐశ్వర్య వేగంగా నడుచుకుని వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె కారు డోర్ ఆరాధ్య కాలికి తగిలింది. దీంతో కూతురు ఏడుపులంకించుకుంది. కుమార్తె వేదనను చూడలేకపోయిన ఐశ్వర్య మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'మీ వల్లే నా కుమార్తె బాధపడుతోంది' అంటూ నిష్టూరమాడింది.