: తండ్రి బాటలో పవన్ కల్యాణ్ కూతురు!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉంది. కూతురు ఆధ్యకు కూడా ఈ అలవాటు అబ్బేటట్లు చేస్తోందిట తల్లి రేణూదేశాయి. పుస్తకపఠనం వల్ల ఆనందంతో పాటు ఐక్యూను కూడా పెంపొందించుకోవచ్చని, ఒంటరితనం దరిచేరదని చెప్పడంతో పాటు ఇంకా పలు ప్రయోజనాలను కూతురుకి రేణూదేశాయి వివరించి చెబుతోందట. పోతే, కొడుకు అకీరా 'ఇష్క్ వాలా లవ్' అనే చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ త్వరలో ఈటీవీ చానెల్ లో ప్రసారం అవుతుంది.