: భవిష్యత్తు గురించి దిగులొద్దు... ఉండేది నేనే!: పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు భరోసా
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తు గురించిన దిగులు అక్కర్లేదని చంద్రబాబు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిశ్రమలు పెట్టాలని వస్తే, ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, "కొందరిలో కొన్ని భయాలు సహజం. మీకిచ్చిన హామీలు నెరవేరుస్తాం. పాలనాపరమైన వ్యవహారాలు, స్థలాల సమీకరణ, అనుమతులు, చట్టబద్ధత పరంగా మిమ్మల్ని చూసుకోవడానికి చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఆయన సాంకేతికత, అభివృద్ధి వ్యవహారాలు చూస్తారు. రాజకీయంగా చూసుకోవడానికి నేనున్నాను. నిరభ్యంతరంగా రండి. భవిష్యత్తు గురించిన దిగులు వద్దు. ఇక్కడ ఉండేది నేనే" అని అన్నారు. చంద్రబాబు మాటలతో ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది.