: పాకిస్థాన్ అంపైర్ అసద్ రవూఫ్ ను బహిష్కరించిన బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్థాన్ అంపైర్ పై బీసీసీఐ బహిష్కరణ వేటు వేసింది. వచ్చే ఐదేళ్ల పాటు అతనిపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2013 ఐపీఎల్ సీజన్ లో 13 మ్యాచ్ ల్లో మైదానంలో నిలబడి అంపైరింగ్ చేసిన రవూఫ్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఆటగాళ్లు అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాలపై ఇప్పటికే బీసీసీఐ చర్యలు తీసుకుంది. రవూఫ్ పాత్రపై విచారించిన ఐసీసీ క్రమశిక్షణా కమిటీ చాంపియన్స్ ట్రోఫీ నుంచి అతన్ని పక్కనబెట్టగా, ఇప్పుడు బీసీసీఐ శిక్షను ఖరారు చేసింది.