: ఓ కేసీఆర్, ఓ థాకరే, ఓ లాలూ కలిస్తే ఎవరంటే...: రాంగోపాల్ వర్మ


నిత్యమూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ పడతాడని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పైకి మళ్లింది. అమెరికా చరిత్రలో ఇంత కలర్ ఫుల్, స్వేచ్ఛగా మాట్లాడే వ్యక్తి మరొకరు లేరని పొగిడిన ఆయన, ఓ బాల్ థాకరే, ఓ కేసీఆర్, ఓ లాలూ ప్రసాద్ యాదవ్ లు కలిస్తే, అతనే డొనాల్డ్ ట్రంప్ అవుతారని అన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తన ట్విట్టర్ ఖాతాలో నేడు ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News