: టైటానిక్ మునిగినట్టే వైసీపీ కూడా మునుగుతుంది: ఆనం వివేకా
ఏపీలో టీడీపీ, వైసీపీల పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీ గూటికి చేరిన నెల్లూరు ముఖ్య నేత ఆనం వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పార్టీ టైటానిక్ షిప్ లాంటిదన్నారు. టైటానిక్ మునిగినట్టే వైసీపీ కూడా మునగడం ఖాయమని వ్యాఖ్యానించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ క్షణంలోనైనా అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకెళతారని చెప్పారు. ఆయనను నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునుగుతారని జగన్ అనుచరులను ఆనం హెచ్చరించారు.