: లోకాయుక్తకు చేరిన సిద్ధరామయ్య వాచ్ వ్యవహారం


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతిగడియారం వ్యవహారం లోకాయుక్త ముందుకు చేరింది. 50 నుంచి 70 లక్షల రూపాయల విలువ చేసే 'హ్యూబ్లోట్' వాచ్ ను ముఖ్యమంత్రి తన ఎన్నికల అఫిడవిట్లో చేర్చలేదని మానవహక్కుల రక్షణా సమితి కార్యకర్త రామమూర్తి గౌడ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అత్యంత ఖరీదైన వాచ్ వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చాలని ఆయన లోకాయుక్తను కోరారు. 2015 మార్చి 31న లోకాయుక్తకు అందజేసిన వివరాల్లో ముఖ్యమంత్రి ఈ వాచ్ గురించి ప్రస్తావించలేదు. అయితే వ్యవసాయం ద్వారా ఏడాదికి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్టు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఏడాదికి 38 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే భార్య పేరిట బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లపై ఏటా 1.25 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, పిల్లలకు ఉన్న వ్యవసాయం ద్వారా 25 లక్షల రూపాయల ఆదాయం వస్తున్నట్టు ఆయన లోకాయుక్తకు గతంలో తెలిపారు. దీంతో ఈ వాచ్ వ్యవహారం నిగ్గుతేల్చాలని ఆయన లోకాయుక్తను కోరారు.

  • Loading...

More Telugu News