: అసెంబ్లీలో సస్పెన్షన్ విధించడంపై కోర్టును ఆశ్రయించా: రోజా
గతేడాది ఏపీ అసెంబ్లీలో తనపై సస్పెన్షన్ విధించడంపై కోర్టును ఆశ్రయించానని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. అంతేగాక తన సస్పెన్షన్ పై స్పీకర్ కు మరోసారి లేఖ రాస్తానని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రోజా తెలిపారు. అసెంబ్లీలోని దృశ్యాలను ఎడిట్ చేసి లీక్ చేశారని, అందుకు అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని రోజా స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను రోజాపై సంవత్సరంపాటు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.