: ముగిసిన వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. ఈ విషయాన్ని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. ఆరు రోజుల్లో స్వామివారి సేవలో 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. నగరంలో ప్రతి ఏటా వైభవోత్సవాలను నిర్వహించేందుకు హర్ష టయోటా సంస్థ యాజమాన్యం ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. కాగా, తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. ముఖ్యంగా నిన్న నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.