: గ్రేటర్ మేయర్ బాధ్యతలు చేపట్టిన బొంతు రామ్మోహన్


జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో చూపించిన ఉత్సాహాన్ని పనిలోనూ చూపుతానని బొంతు ఈ సందర్భంగా తెలిపారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నెల 29న గ్రేటర్ కౌన్సిల్ తొలి సమావేశం జరుగుతుందని రామ్మోహన్ చెప్పారు.

  • Loading...

More Telugu News