: మా పార్టీలోకి వచ్చేందుకు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు: వైఎస్సార్సీపీ
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా తమ పార్టీలోకి రావొచ్చని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆర్కె, ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు మీడియాతో వీరు మాట్లాడుతూ, టీడీపీకి చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని, ఆ పార్టీని ప్రజలు ఏవగించుకుంటున్నారని విమర్శించారు. గడచిన రెండేళ్లలో టీడీపీ ఏ ఒక్క మంచిపనీ చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అన్నారు.