: వెనిజులాలో ‘జికా’ స్వైర విహారం... ముగ్గురి ప్రాణాలు బలిగొన్న వైరస్


మిస్టరీ వైరస్ ‘జికా’ స్వైర విహారం చేస్తోంది. పాశ్చాత్య దేశాల్లో వెలుగుచూసిన ఈ వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులకు చికిత్స లేదు. దీంతో అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వైరస్ పేరు చెబితేనే గడగడలాడిపోతోంది. ఎందుకంటే... ఇటీవలే ఎబోలా వైరస్ తో ఆ దేశం బెంబేలెత్తింది. తాజాగా వెలుగుచూసిన జికా వైరస్ ప్రస్తుతం వెనిజులాలో స్వైర విహారం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన 319 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అంతటితో ఆగని ఆ వైరస్ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆ దేశం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News