: స్టెప్పులతో దుమ్మురేపిన జైలర్... వీడియో వైరల్, సస్పెండ్ చేసిన తమిళ సర్కారు


తమిళనాడులోని సేలం కారాగారం జైలర్ శంకరన్ ను సస్పెండ్ చేస్తూ జయలలిత సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. జైలులో ఖైదీలను క్రమశిక్షణలో ఉంచాల్సిన ఈయనగారు కట్టుతప్పారు. ఏదో మైకం కమ్మిన వాడిలా చిందులు తొక్కారట. అది కూడా పల్లెటూరి స్టెప్పులతో పాటు వెస్టర్న్ స్టైల్లోనే ఆయన డ్యాన్స్ చేశారు. ఇంతకీ ఆయన నృత్య కౌశలాన్ని ఎక్కడ ప్రదర్శించారో తెలుసా? తాను పనిచేసే జైల్లోనే! చుట్టూ తన సిబ్బంది, కొంతమంది ఖైదీలు చేరగా, ఖాకీ యూనిఫాంలోనే ఆయన శివాలెత్తిపోయారు. ఈ సందర్భంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కేసింది. వైరల్ అయిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళ పోలీసు బాసులు శంకరన్ ను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే, శంకరన్ కు డ్యాన్స్ పైత్యమే కాదండోయ్, ఖైదీలతో ఆయిల్ మసాజ్ చేయించుకునే అలవాటు కూడా ఉందట.

  • Loading...

More Telugu News