: సెక్స్ వర్కర్లకు కొత్త జీవితం... నటన, డాన్స్ లలో శిక్షణ!


ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా కోల్ కతాలోని సోనగచి. ఎన్నోఏళ్ల నుంచి వేశ్యావృత్తే వారికి ప్రధాన జీవనాధారం. అయితే, ఇకపై వారు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సినిమాలు, టీవీ సీరియల్స్ లో నటించేందుకు గాను నటన, డాన్స్, సింగింగ్ లలో శిక్షణ తీసుకుంటున్నారు. వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టబడి, దాని నుంచి బయటకు రావాలనుకుంటున్న కొంతమంది యువతులను ఇటీవల ఓ ఎన్జీవో చేరదీసింది. వారందరికీ ప్రభుత్వ సహకారంతో ఏబీసీ ఆఫ్ యాక్టింగ్ నిపుణుల చేత శిక్షణ ఇప్పిస్తోంది. ఇటువంటి వారు మళ్లీ అందరిలా జీవితం గడిపేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం 'ముక్తిర్ అలో' అనే చిన్న ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పుడు, సెక్స్ వర్కర్ల కోసం రెండో విడత పునరావాస పథకాన్ని అమలు చేస్తోంది. దానిలో భాగంగానే వారికి నటనలో శిక్షణ ఇస్తున్నారు. దాని ద్వారా వారికాళ్లపై వారు నిలబడేందుకు అవకాశం ఉంటుందని, సినీ, టీవీ దర్శకులు, నిర్మాతలను కలసి శిక్షణ ఇప్పిస్తున్నామని ఆ రాష్ట్ర మహిళావృద్ధి శాఖ మంత్రి శశి పంజ చెప్పారు.

  • Loading...

More Telugu News