: షారూక్ ఖాన్ కు ముంబై మునిసిపాలిటీ జరిమానా


అధికారుల నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా తన ఇంటి ముందు ర్యాంప్ నిర్మించాడన్న ఆరోపణలపై బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కు రూ. 1.93 లక్షల జరిమానా విధించినట్టు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఈ విషయం స.హ చట్టాన్ని వినియోగించుకుంటూ అనిల్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు. బాంద్రాలోని తన ఇంటి వద్ద గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆయన ర్యాంప్ నిర్మించగా, అప్పటిలోనే బీఎంసీ నోటీసులు జారీ చేసింది. దాన్ని తొలగించకుంటే, తాము కల్పించుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు పంపింది. దీనిపై షారూక్ స్పందించక పోవడంతో, ఫిబ్రవరి 15న అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ర్యాంపును కూలగొట్టారు. ఈ క్రమంలో, గవర్నమెంటు స్థలంలో షారూక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారంటూ, అనిల్ ప్రశ్నించగా, ఆయనకు జరిమానా విధించినట్టు సమాధానం వచ్చింది.

  • Loading...

More Telugu News