: కాంచీపురం జేఎస్ సిల్క్స్ ను ప్రారంభించిన కేసీఆర్... స్పెషల్ అట్రాక్షన్ గా కోడలు శైలిమ


ప్రసిద్ధ కంచిపట్టు చీరలకు నిలయమైన ‘కాంచీపురం‘ పేరిట హైదరాబాదులో తొలిసారిగా రంగప్రవేశం చేసిన ‘కాంచీపురం జేఎస్ సిల్క్స్’ షోరూంను తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న ప్రారంభించారు. సోమాజిగూడలో ఏర్పాటైన ఈ షోరూం ప్రారంభోత్సవానికి కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. భార్య శోభతో కలిసి ఆయన షోరూం రిబ్బన్ కట్ చేశారు. ఆ తర్వాత షోరూం మొత్తం కలియదిరిగి అక్కడి కంచి పట్టు చీరలను పరిశీలించారు. ఇక అత్తామామల వెంట షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ సతీమణి శైలిమ షోరూంలో తొలి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కంచి పట్టు చీరలను పరిశీలిస్తూ ఆమె సందడి చేశారు. చీరలను భుజాన వేసుకుని పరిశీలించిన ఆమె అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రాలను ఓ తెలుగు దినపత్రిక నేడు ప్రముఖంగా ప్రచురించింది. ఇదిలా ఉంటే, కేపీహెచ్ బీ కాలనీలో ఏర్పాటైన ఇదే సంస్థకు చెందిన మరో షోరూంను త్రిదండి చినజీయర్ స్వామి ప్రారంభించారు.

  • Loading...

More Telugu News