: స్పృహతప్పి పడిపోయిన ముషారఫ్... ఆసుపత్రిలో చేరిక


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆసుపత్రిలో చేరారు. కుటుంబ సభ్యులతో గడుపుతుండగా అకస్మాత్తుగా ఆయన స్పృహతప్పి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కట్టుదిట్టమైన భద్రత మధ్య హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. పీఎన్ఎస్ షఫి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించింది. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్ విడుదల చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News