: చూడు శివాజీ! నాకు క్లాస్ పీకొద్దు...నచ్చితే సినిమా చూడండి లేకపోతే మానేయండి: రాంగోపాల్ వర్మ


'నా సినిమాని చూడాలనిపిస్తే చూడండి, లేకపోతే మానేయండ'ని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'వంగవీటి' సినిమా విషయంలో తాను ఏం తీయాలనుకున్నానో అదే తీస్తానని అన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ ఆ లైవ్ ప్రోగ్రాంలోకి వచ్చి 'వర్మ గారూ, మీరు ఇలాంటి సినిమా తీయడం సరికాద'ని హితవు పలికాడు. దానికి వర్మ 'నాకు నచ్చిన సినిమా నేను తీసుకుంటాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి' అని చెప్పారు సీరియస్ గా. దీనికి శివాజీ స్పందిస్తూ, 'సామాజిక బాధ్యత మీకు లేదా?' అని ప్రశ్నించాడు. 'తనకు కూడా సామాజిక బాధ్యత ఉందని, తానేం చేస్తున్నానో తనకు తెలుస'ని వర్మ బదులిచ్చారు. ఇంతలో శివాజీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, 'చూడు శివాజీ! నాకు క్లాసు పీకొద్దు...నేనేం చేస్తున్నానో, నేనేం చేయాలో నాకు తెలుస'ని వర్మ ఘాటుగా సమాధానం చెప్పారు. దీనికి ఆగ్రహించిన శివాజీ 'మీరు చెబితే మేమంతా వినాలి...మేము చెబితే మాత్రం మీరు వినరా?' అని ప్రశ్నించాడు. అయితే, దీనికి మాత్రం వర్మ సమాధానం చెప్పలేదు.

  • Loading...

More Telugu News