: తెలంగాణ మున్సిపల్ చట్టం సవరింపు... ఎన్నికల నామినేషన్ల గడువు కుదింపు


తెలంగాణ మున్సిపల్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల నామినేషన్ల గడువును మూడు రోజులకు కుదిస్తున్నట్టు జీవోలో పేర్కొంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిశాక పరిశీలన ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఒకరోజే గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన 9వ రోజున పోలింగ్ నిర్వహించాలని, ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే పోలింగ్ సమయాన్ని 8 గంటలుగా నిర్ణయించినట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News