: ఎర్రబెల్లితో కలవనంటున్న పాలకుర్తి టీఆర్ఎస్ ఇంచార్జి
ఇన్నాళ్లు టీఆర్ఎస్ ను తిట్టి మళ్లీ ఆ పార్టీ పంచన చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావును కొంతమంది గులాబీ నేతలు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి సుధాకర్ రావు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పుకున్నా ఆయనతో కలసి పనిచేయనని మీడియాకు స్పష్టం చేశారు. అయితే తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తెలిపారు. అలాగే మంత్రులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని ఆయన కోరారు.