: నేను టీడీపీలో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదు: ఎమ్మెల్యే జలీల్ ఖాన్
తాను టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను వైసీపీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఖండించారు. ఈ ఉదయం చంద్రబాబును కలసిన అనంతరం విజయవాడలోని గుప్త కల్యాణ మండపంలో జరిగిన ముస్లిం మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో మీడియాతో జలీల్ మాట్లాడుతూ, టీడీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీలో చేరేందుకు తాను చంద్రబాబును కలవలేదని స్పష్టం చేశారు. ముస్లిం, మైనారిటీ గర్జన విషయంపై మాట్లాడేందుకే సీఎంను కలిశానని వివరించారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ సమక్షంలోనే నియోజకవర్గ సమస్యలపై చర్చించామని ఉద్ఘాటించారు.