: సభ్యుల ప్రవర్తనపై బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో నిర్ణయం తీసుకుంటాం: స్పీకర్ కోడెల


సీఎం చంద్రబాబుతో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమైన స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండు అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు. మార్చి మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గత అసెంబ్లీ సమావేశాల్లో అసభ్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంపై చర్చించినట్టు చెప్పారు. సభ్యుల ప్రవర్తనపై అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటామని విలేకరులకు వెల్లడించారు. సభ్యుల అసభ్య వ్యాఖ్యలపై ఈ నెల 25లోగా కమిటీ అసెంబ్లీకి నివేదిక ఇస్తుందని, ఆ నివేదికను ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను సభలో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోడెల చెప్పారు. ఎన్నో ప్రజాసమస్యలు ఈ సమావేశాల్లో చర్చకు రావాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News