: చిరుతపులుల సంచారంతో బెంగళూరులో పాఠశాలలకు సెలవు!


బెంగళూరు వాసులను చిరుతపులులు వణికిస్తున్నాయి. వారం కిందట వైట్ ఫీల్డ్ ప్రాంతంలోని విబ్జేఆర్ పాఠశాలలోకి చిరుత వచ్చివెళ్లింది. మళ్లీ నాలుగు రోజులకే అదే పాఠశాల్లోకి చిరుత రాగా దానిని వీడియో తీస్తున్న వ్యక్తిని అది తీవ్రంగా గాయపరిచింది. చివరికి అటవీ శాఖ అధికారులు దానిని బంధించి జూకు తరలించారు. అయినప్పటికీ చిరుతపులులు సంచరిస్తున్నాయన్న వదంతులతో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేందుకు భయపడుతున్నారు. దాంతో స్కూళ్ల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వర్తూర్, మరాఠా హల్లి, దొడ్డనకనెల్లి, ఇమ్మాడిహల్లి, తూర్పు బెంగళూరు ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేశారు. ముందు 134 పాఠశాలలకు సెలవు ప్రకటించగా, నిన్న(బుధవారం) మరో 60 స్కూళ్లకు సెలవు ఇచ్చారు. ఇవాళ ఆ సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు చిరుతపులులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే వాటిని బంధిస్తామని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News