: ఇష్రత్ జహాన్ 'లష్కరే' మహిళా విభాగ సభ్యురాలే: డేవిడ్ హెడ్లీ


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు కీలక విషయాలు వెల్లడిస్తున్న డేవిడ్ హెడ్లీ నాలుగోరోజు విచారణలో కూడా ముఖ్య విషయాలు చెప్పాడు. లష్కరే తోయిబాలో మహిళా విభాగం ఉందని, అందులో జహాన్ సభ్యురాలని వెల్లడించాడు. లష్కరే సూసైడ్ బాంబర్స్ లో ఓ పేరు చెప్పాలంటూ ప్రాసిక్యూటర్ ఆప్షన్స్ ఇవ్వగా, వెంటనే హెడ్లీ ఇష్రత్ జహాన్ పేరును చెప్పాడు. 2004లో గుజరాత్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 19 ఏళ్ల ఇష్రత్ జహాన్, మరో ముగ్గురు చనిపోయారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించగా, అది 'ఫేక్ ఎన్ కౌంటర్' అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News