: సల్మాన్ నుంచి పరిహారం ఇప్పించండి... సుప్రీంకోర్టులో 'హిట్ అండ్ రన్' బాధిత కుటుంబం పిటిషన్
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు విముక్తి కల్పించినా ఆ కేసు ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడంపై కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, తాజాగా ఈ కేసులో బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని వారు కోరారు. అంతేగాక, తమకు నష్టపరిహారం ఇప్పించేలా సల్మాన్ కు ఆదేశాలు జారీ చేయాలని నాటి ఘటనలో చనిపోయిన షేక్ నూరుల్లా షఫిక్ భార్య, కుమారుడు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 2002లో ముంబయిలో రాత్రివేళ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ కారు దూసుకుపోవడంతో షఫిక్ మరణించాడు.