: మేయర్ గా అవకాశం రావడం నా అదృష్టం: బొంతు రామ్మోహన్


గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చారిత్రక విజయం నమోదు చేసుకోవడంతో ఆ పార్టీ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ ను అదృష్టం వరించింది. దాంతో నేడు ఆయన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ భవన్ లో ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం తరువాత రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ మేయర్ గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తామని, నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News