: అయ్యో! ఎంత మాటన్నాడు, నాకూ బాధేసింది: మార్క్ జుకర్ బర్గ్


ఇండియాది వలసవాద భావజాలం అంటూ ఫేస్‌ బుక్‌ బోర్డ్‌ మెంబర్‌ మార్క్‌ ఆండ్రీసేన్‌ చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్ట నివారణకు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆండ్రే వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తననూ బాధించాయని, ఆయనా మాట అనకుండా ఉండాల్సిందని అన్నారు. భారత మార్కెట్ తమకెంతో ముఖ్యమని చెప్పిన జుకర్‌ బర్గ్‌, గతంలో ఇండియాలో పర్యటించినప్పుడు భారతీయులను నిశితంగా పరిశీలించానని చెప్పారు. ప్రజల మానవత్వం, వారు పాటించే విలువలు తనను ప్రభావితం చేశాయని అన్నారు. ఆండ్రీసేన్‌ కామెంట్ పై తాను స్పందించాలని భావించానని చెప్పిన జుకర్‌ బర్గ్‌, ఇది ఫేస్ బుక్ అభిప్రాయం కాదని, ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలన్న విషయాన్ని గమనించాలని కోరారు.

  • Loading...

More Telugu News