: మొదటి నుంచీ సీక్రెట్ ఫ్రెండ్, ఇప్పుడు బయటపడ్డాడు... అంతే తేడా: 'ఎర్రబెల్లి'పై రేవంత్ రెడ్డి కామెంట్


ఎర్రబెల్లి దయాకర్ రావు ఆది నుంచి తెలంగాణ రాష్ట్ర సమితితో స్నేహం చేస్తూనే వచ్చారని, నిన్నటి వరకూ రహస్యంగా సాగిన ఆ స్నేహబంధం, ఇప్పుడు బట్టబయలైందని తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ రాత్రిపూట ఎవరికీ తెలియకుండా టీఆర్ఎస్ నేతలను కలిసే ఆయన ఇప్పుడిక పగలు కూడా కలుస్తాడని, అంతకు మించి తేడా ఏమీ లేదని అన్నారు. తెలంగాణలో కులాల వారీగా రాజకీయ నేతలు ఏకమవుతున్నారని, అందులో భాగంగానే ఎర్రబెల్లి పార్టీ మార్పు జరిగిందని చెప్పిన రేవంత్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీయే లేకుంటే పాలకుర్తి నుంచి ఆయన గెలిచేవాడా? అని ప్రశ్నించారు. దమ్ముంటే అందరిచేతా రాజీనామా చేయించి గెలిపించుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇకపై తెలుగుదేశం పార్టీ బడుగుల అండతో రెట్టించిన ఉత్సాహంతో మరింతగా విస్తరిస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News