: 'ఓటుకు నోటు' డబ్బు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నుంచే... నేడు అరెస్ట్?
ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు రేవంత్ రెడ్డి తీసుకువెళ్లిన డబ్బును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నుంచి అందిందన్న పక్కా సాక్ష్యాలను సేకరించిన ఏసీబీ అధికారులు మాగంటిని నేడు లేదా రేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరంలో తెలంగాణ శాసనమండలి సభ్యుల ఎన్నిక సందర్భంగా తెదేపా తరఫున నిలబడ్డ వేం నరేందర్‌రెడ్డిని గెలిపించుకోవడానికి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులను కొనేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్ సహా మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆపై డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? అన్న కోణాలపై సమగ్ర దర్యాఫ్తు జరిపి స్పష్టమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం.