: హస్తినకు పయనమవుతున్న కేసీఆర్... రేపు ప్రధానితో కీలక భేటీ


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గ్రేటర్ ఘన విజయంతో ఉత్సాహంగా ఉన్నారు. హైదరాబాదు చరిత్రలోనే రికార్డు విజయాన్ని సాధించిన టీఆర్ఎస్ నేడు గ్రేటర్ పాలనను చేపట్టబోతోంది. గ్రేటర్ పాలనను పార్టీ కార్పొరేటర్లకు అప్పగించిన తర్వాత నేటి సాయంత్రం ఆయన దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై ఆయన మోదీ వద్ద ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News