: ‘తుని ఘటన’తో మాకు ఏ సంబంధం లేదు: వైఎస్సార్సీపీ నేతలు


‘తుని ఘటన’తో తమకు ఎటువంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇటీవల తునిలో నిర్వహించిన కాపు ఐక్యగర్జన సదస్సు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో వైఎస్సార్సీపీ నేతలకు సంబంధముందంటూ టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వారు ఆయనకు హితవు పలికారు.‘తుని ఘటనతో మాకు సంబంధం లేదని కాణిపాక ఆలయంలో ప్రమాణం చేస్తాము. అందుకు ముద్దు కృష్ణమనాయుడు సిద్ధమా?’ అని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కురసాల కన్నబాబు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News