: 10 లక్షలు ఇవ్వకపోతే జడ్జీలను చంపేస్తామంటున్నారు
ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ జడ్జీలను దుండగులు హెచ్చరించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా జడ్జి కార్యాలయానికి రెండు లేఖలు వచ్చాయి. ఈ లేఖల్లో జిల్లా న్యాయమూర్తి, అదనపు న్యాయమూర్తుల పేర్లను ప్రస్తావించిన దుండగులు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ఇవ్వాలని, లేనిపక్షంలో వారు ప్రయాణించే వాహనాలను మార్గమధ్యంలోనే పేల్చేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు న్యాయమూర్తులకు భద్రత పెంచారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.