: నేను బిజీ కాదు...కేవలం రెండు సినిమాలే ఉన్నాయి: తాప్సీ
'ఝమ్మందినాదం' సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసిన తాప్సీ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ట్విట్టర్ మాధ్యమంగా తాను బిజీగా లేనని చెప్పింది. మీడియా ప్రచారం చేస్తున్నట్టు తానేమీ అంత బిజీగా లేనని స్పష్టం చేసింది. తన చేతిలో రానా హీరోగా రూపొందుతున్న ఘాజీ, ఇంకా పేరు పెట్టని రైజింగ్ సన్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమాలో మాత్రమే నటిస్తున్నానని ట్వీట్ చేసింది. దీనిపై టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. సాధారణంగా చేతిలో సినిమాలు లేకపోయినా చాలా సినిమాలు చేతిలో ఉన్నాయని, లేదా ఇంకో భాషలో బీజీగా ఉన్నామని చెప్పుకునే రోజుల్లో తన చేతిలో సినిమాలు లేవని ధైర్యంగా చెప్పడం విశేషమే అంటున్నారు.