: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో బాలకృష్ణ భేటీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడిని తెలుగుదేశం పార్టీ నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ మధ్యాహ్నం కలిశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన బాలయ్య దాదాపు అర గంటకు పైగా వెంకయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం బయటకు వచ్చిన బాలయ్య మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ప్రారంభమయ్యే లేపాక్షి ఉత్సవాలకు కేంద్ర మంత్రిని ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. ఉత్సవాలకు వచ్చేందుకు ఆయన సమ్మతించారని, వీటిని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయని పేర్కొన్నారు.